-->

నా మూట నా ఇష్టం, రేవంత్ రెడ్డికి చెప్పుకో పో (వీడియో)

నా మూట నా ఇష్టం, రేవంత్ రెడ్డికి చెప్పుకో పో (వీడియో)


నిర్మల్ డిపోకు చెందిన పల్లె వెలుగు బస్సులో ఓ మహిళా ప్రయాణికురాలు మరియు కండక్టర్ మధ్య జరిగిన వివాదం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

నిర్మల్ డిపో టీఎస్ 18 టీ 8485 బస్సు శుక్రవారం రాత్రి 7 గంటలకు నిర్మల్ నుండి బైంసాకు బయలుదేరింది. ఈ బస్సులో దేగామ్ గ్రామానికి చెందిన ఎల్క బాయి అనే మహిళ పెద్ద మూటలతో బస్సులోకి ఎక్కింది. ఆమె లగేజీ దారిలో అడ్డం పెట్టడంతో, కండక్టర్ డీఆర్ స్వామి మూటల్ని తొలగించమని, లేదా బస్సు దిగిపోవాలన్న సూచన చేశాడు.


కండక్టర్ మాట్లాడుతూ, "మూటల్ని ఇలా ఉంచితే ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుందని" చెప్పగా, ఆ మహిళ ఆగ్రహంతో స్పందించింది. ఆమె “నా మూట నా ఇష్టం, ఇక్కడే పెడతా. కావాలంటే రేవంత్ రెడ్డికి చెప్పుకో” అంటూ కండక్టర్ చొక్కా పట్టుకుని వార్నింగ్ ఇచ్చింది.

ఈ సంఘటనతో బస్సులో ఉన్న ఇతర ప్రయాణికులు కూడా అసహనానికి గురయ్యారు. వీడియో వైరల్ కావడంతో ఈ ఘటనపై అధికారులు స్పందించే అవకాశం ఉంది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793