పోలీస్ కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత దామోదర్ మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా పూజారి కంకేర్ మారేడు బాక అడవుల్లో నిన్న జరిగిన ఎదురు కాల్పుల్లో తెలంగాణకు చెందిన మావోయిస్టు కీలక నేత బడే చొక్కా రావు అలియాస్ దామోదర్ మృతి చెందారు.
దామోదర్ మృతిచెందినట్లు మావోయిస్టు పార్టీ ఈరోజు లేఖ విడుదల చేసి ధృవీకరించింది. ఆ లేఖ ప్రకారం, నిన్న జరిగిన కాల్పుల్లో దామోదర్‌తో పాటు మరో 17 మంది మృతిచెందారు.
ములుగు జిల్లా కాల్వపల్లి గ్రామానికి చెందిన దామోదర్ దాదాపు 30 ఏళ్లుగా మావోయిస్టు పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ మావోయిస్టు కమిటీ కార్యదర్శిగా, అలాగే పార్టీ యాక్షన్ టీమ్‌ల ఇన్‌చార్జిగా బాధ్యతలు చేపట్టారు.
ఆయనపై ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం రూ. 50 లక్షల రివార్డు, తెలంగాణ ప్రభుత్వం రూ. 25 లక్షల రివార్డు ప్రకటించినప్పటికీ, దామోదర్ పోలీసులకు గడచిన ఎన్నో ఏళ్లుగా మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నారు.
ఆరు నెలల క్రితం మాత్రమే ఆయన మావోయిస్టు పార్టీ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించారు. దామోదర్ మృతి మావోయిస్టు ఉద్యమానికి కీలక లోటుగా భావించవచ్చు.

Post a Comment