అసదుద్దీన్ ఒవైసీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్: హైదరాబాద్ లోక్‌సభ సభ్యులు మరియు ఎంఐఎం పార్టీ అధ్యక్షులు అసదుద్దీన్ ఒవైసీ జన్మదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆయనకు హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. ఓవైసీ ప్రజాసేవాపట్ల అంకితభావాన్ని ప్రశంసించిన సీఎం, వారు ఎల్లప్పుడూ ప్రజల మధ్య ఉండి, వారి సమస్యలకు పరిష్కారం చూపే విధంగా పనిచేస్తూ రాష్ట్రాభివృద్ధిలో తన పాత్రను నింపుతున్నారని అన్నారు.
అలాగే భవిష్యత్తులో కూడా ఆయన ప్రజల సేవలో మరింత చురుకుగా పాల్గొని, సమాజానికి ఉపయోగపడే విధంగా కార్యకలాపాలు సాగించాలని ఆకాంక్షించారు. భగవంతుడు ఆయన్ను ఆయురారోగ్యాలతో ఆశీర్వదించాలని, ప్రజల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఆయనతో ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ సందర్భంగా పలువురు రాజకీయ నాయకులు, అభిమానులు, పార్టీ కార్యకర్తలు కూడా అసదుద్దీన్ ఒవైసీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Post a Comment