భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో మిస్ వరల్డ్ ఫెస్టివల్‌పై ఉత్కంఠ
ఉద్రిక్తతల నడుమ ఉత్కంఠ
భారత్-పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ అంతర్జాతీయ ఈవెంట్ నిర్వహణపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ పోటీలను Telangana ప్రభుత్వం తీవ్ర భద్రత నడుమ నిర్వహించనుంది. వివిధ దేశాల నుంచి వచ్చిన భామలకు గట్టి భద్రత కల్పించామని అధికారులు వెల్లడించారు.
ప్రతినిధుల ఆకర్షణ
భారతదేశం తరఫున నందిని గుప్తా పోటీలో పాల్గొనగా, అమెరికా నుండి అథెన్నా క్రాస్బీ, కెనడా నుండి ఎమ్మా మోరిసన్, వెనిజులా నుంచి వాలేరియా కాన్యావో వంటి గ్లోబల్ ప్రతినిధులు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. గ్వాడలూప్, గిబ్రాల్టర్, క్యురాకావ్ వంటి చిన్న దేశాల నుంచి కూడా పోటీదారులు పాల్గొనడం విశేషం.
వివిధ రంగాలకు చెందిన పోటీదారులు
ఈవెంట్‌లో పాల్గొంటున్న వారిలో విద్యార్థులు, డాక్టర్లు, న్యాయవాదులు, సామాజిక కార్యకర్తలు, కళాకారులు వంటి విభిన్న రంగాలకు చెందిన ప్రతిభావంతులు ఉన్నారు. ఈ నెల మొత్తాన్ని వారు తెలంగాణలోని పర్యాటక, వైద్య, చేనేత, సాంస్కృతిక కేంద్రములను సందర్శించనున్నారు.
మే 31న గ్రాండ్ ఫినాలే
గత సంవత్సరం ముంబయిలో జరిగిన మిస్ వరల్డ్ ఈవెంట్ తరువాత, ఈ ఏడాది మే 31న హైదరాబాద్ హైటెక్స్ వేదికగా గ్రాండ్ ఫినాలే జరగనుంది. వరుసగా రెండో సంవత్సరం భారత్‌లో ఈ పోటీలు జరగడం అరుదైన ఘనతగా నిలుస్తోంది. ఇది దేశానికి మాత్రమే కాదు, తెలంగాణకు కూడా అంతర్జాతీయ గుర్తింపు తెస్తోంది.
Post a Comment