-->

కల్తీ కల్లు ఘటనపై చర్యలు: బాలానగర్ ఎక్సైజ్ సీఐ సస్పెండ్

కల్తీ కల్లు ఘటనపై చర్యలు: బాలానగర్ ఎక్సైజ్ సీఐ సస్పెండ్


హైదరాబాద్, బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల చోటు చేసుకున్న కల్తీ కల్లు కలకలంపై ఎట్టకేలకు అధికారులు గట్టిగా స్పందించారు. ఈ ఘటనకు బాధ్యుడిగా భావిస్తూ, స్థానిక ఎక్సైజ్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ) వేణు కుమార్‌ను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

బాలానగర్ పరిధిలో కల్తీ మద్యం విక్రయాలు అడ్డుపడకుండా సాగడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనేక మంది అస్వస్థతకు గురవడం, మరికొందరికి ప్రాణాపాయం ఎదురవడం వంటి సంఘటనల నేపథ్యంలో విచారణ ప్రారంభమైంది. ప్రాథమిక విచారణలో బాదిత ప్రాంతాల్లో ఎక్సైజ్ అధికారుల నిర్లక్ష్యం స్పష్టమవడంతో, సీఐ వేణు కుమార్‌పై వేటు వేయడం జరిగింది.

ఎక్సైజ్ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఈ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ కాగా, కల్తీ మద్యం వ్యాప్తి, నియంత్రణపై మరింత కఠినంగా వ్యవహరించాలని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఈ ఘటనపై మరిన్ని అధికారుల పాత్రపై విచారణ కొనసాగుతోంది.

కల్తీ మద్యం వల్ల ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టే వారికి ఎటువంటి రాయితీ లేదని ప్రభుత్వం హెచ్చరించింది. ఎక్సైజ్ శాఖ అధికారులు మద్యం సరఫరాపై నిఘా పెంచాలని, అనధికారంగా విక్రయాలు జరిగే చోట్ల దాడులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు.

Blogger ఆధారితం.