-->

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి హైదరాబాద్ చేరిక

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి హైదరాబాద్ చేరిక


హైదరాబాద్, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్. గవాయ్ శుక్రవారం హైదరాబాద్‌కు విచ్చేశారు. ఆయన రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోగానే తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌ (DGP) జితేందర్, IPS అతిధి గౌరవంతో స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా జస్టిస్ గవాయ్‌కు పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికిన అధికారులు, ఆయన Hyderabad పర్యటనకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. జస్టిస్ గవాయ్ పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ముఖ్యంగా న్యాయ రంగానికి సంబంధించి రాష్ట్రస్థాయిలో నిర్వహించబోయే సమావేశాల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతారు.

ప్రముఖ న్యాయమూర్తి వచ్చిన సందర్భంగా, న్యాయవాదులు, న్యాయ పరిపాలన అధికారుల మధ్య భారీ ఆసక్తి నెలకొంది. ఆయన పర్యటన న్యాయవ్యవస్థ అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని న్యాయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Blogger ఆధారితం.