అక్రమంగా తరలిస్తున్న 340 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యాన్ని పట్టుకున్న టాస్క్‌ఫోర్స్ అధికారులు
తూప్రాన్, నవంబర్ 12: సంగారెడ్డి జిల్లా పాషా మైలారం నుండి మహారాష్ట్ర నాందేడ్ వైపు అక్రమంగా తరలిస్తున్న 340 క్వింటాళ్ల ప్రభుత్వ పిడిఎస్ బియ్యాన్ని టాస్క్‌ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు. నమ్మదగిన సమాచారం మేరకు డీఎస్పీ రమేశ్ రెడ్డి ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్లు నరసింహులు, అజయ్, సాయి కుమార్ లు సంయుక్తంగా చర్యలు చేపట్టారు.
సమాచారం ఆధారంగా వాహనాన్ని వెంటాడి తూప్రాన్ బైపాస్ వద్ద ఆపి తనిఖీ చేయగా, అందులో భారీ స్థాయిలో ప్రభుత్వ పిడిఎస్ బియ్యం తరలిస్తున్నట్లు బయటపడింది. వెంటనే అధికారులు వాహనాన్ని స్వాధీనం చేసుకుని తూప్రాన్ పోలీస్‌స్టేషన్‌లో ఉంచారు.
తరువాత సీజ్ చేసిన బియ్యాన్ని తూప్రాన్‌లోని పౌర సరఫరాల గోదాములలో భద్రపరిచినట్లు రాష్ట్ర సివిల్ సప్లై డీఎస్పీ రమేశ్ రెడ్డి తెలిపారు. ఈ ఘటనలో డ్రైవర్, క్లీనర్‌ను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినట్లు ఆయన వెల్లడించారు.
ఈ ఆపరేషన్‌లో సివిల్ సప్లై విభాగానికి చెందిన ఇన్స్పెక్టర్లు నరసింహులు, అజయ్, సాయి కుమార్ లు ముఖ్యపాత్ర పోషించారు.

Post a Comment