మైనారిటీ వెల్ఫేర్, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ మంత్రిగా అజారుద్దీన్ బాధ్యతలు స్వీకారం
హైదరాబాద్ : నవంబర్ 10: సచివాలయంలో శుభాకాంక్షల సందడి రాష్ట్ర మైనారిటీ వెల్ఫేర్ మరియు పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ మంత్రిగా అజారుద్దీన్ సోమవారం సచివాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సచివాలయ వాతావరణం శుభాకాంక్షల సందడితో నిండిపోయింది.
మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మరియు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సెక్రటరీ సంపత్ కుమార్, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ నాయకులు, అభిమానులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి అజారుద్దీన్ మాట్లాడుతూ – రాష్ట్రంలోని మైనారిటీల అభ్యున్నతి, సంక్షేమం కోసం అన్ని విధాల కృషి చేస్తానని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో ప్రభుత్వం తీసుకొస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తానని తెలిపారు.
సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు హాజరై మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు.

Post a Comment