-->

అందెశ్రీకి సీఎం రేవంత్‌రెడ్డి అశ్రునివాళి అందెశ్రీ పాడె మోశారు.

అందెశ్రీకి సీఎం రేవంత్‌రెడ్డి అశ్రునివాళి అందెశ్రీ పాడె మోశారు.


హైదరాబాద్‌, నవంబర్‌ 11: తెలంగాణ రాష్ట్ర గీత రచయిత, ప్రముఖ కవి, రచయిత, ఉద్యమకారుడు అందెశ్రీ గారి పార్థీవ దేహానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఘన నివాళి అర్పించారు. ఎంతోకాలంగా అత్యంత సన్నిహితంగా మెలిగిన అందెశ్రీ గారి ఆకస్మిక మరణం పట్ల సీఎం తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి లాలాపేట్‌ జయశంకర్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన భౌతిక దేహ దర్శనానికి హాజరై పూలమాలలు వేసి అశ్రునివాళి అర్పించారు. అనంతరం తార్నాక, ఉప్పల్‌, ఘట్‌కేసర్‌ మార్గంగా సాగిన అంతిమయాత్రలో పాల్గొని అందెశ్రీ గారి పాడె మోశారు.

అంతిమ సంస్కార కార్యక్రమాన్ని సీఎం స్వయంగా పరిశీలించగా, అందెశ్రీ కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆయన సతీమణి మల్లుబాయి, కుమార్తెలు వాక్కులమ్మ, వెన్నెల, వేకువ, కుమారుడు దత్తు సంప్రదాయ పద్ధతిలో కర్మకాండలు నిర్వహించారు.

వేలాదిగా తరలివచ్చిన అభిమానులు, సాహితీప్రియులు, ఉద్యమ కార్యకర్తలు కవియోధుడికి కడసారి వీడ్కోలు పలికారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు ఘట్‌కేసర్‌ సమీపంలోని ఎన్ఎఎఫ్‌సీ నగర్‌లో పూర్తయ్యాయి.

సాహిత్య సమరయోధుడి అంతిమయాత్రలో సీఎం రేవంత్‌రెడ్డి గారితో పాటు మంత్రులు దానసరి భాస్కర్‌రామ్‌, జూపల్లి కృష్ణారావు, సీతక్క, పొన్నం ప్రభాకర్‌, పాంగులేటి సుధాకర్‌రెడ్డి, అదలూరి లక్ష్మణ్‌, ప్రభుత్వ సలహాదారులు వేమ నరేందర్‌రెడ్డి, కే. కేశవరావు, పీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్‌ గౌడ్‌, ప్రజాప్రతినిధులు, అధికారులు, సాహితీ వేత్తలు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793