సినీ లోకం దుఃఖంలో మునిగింది ప్రముఖ బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర కన్నుమూత
ముంబయి : నవంబర్ 11: హిందీ సినీ రంగంలో లెజెండరీ నటుడిగా పేరుపొందిన ధర్మేంద్ర (89) కన్నుమూశారు. కొద్ది రోజులుగా శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతూ ముంబయిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు తుదిశ్వాస విడిచారు.
ఆయనకు ఇద్దరు భార్యలు ఉన్నారు — ప్రకాశ్ కౌర్, హేమమాలిని. మొదటి భార్య సంతానంలోనే బాలీవుడ్ స్టార్ హీరోలు సన్నీ డియోల్, బాబీ డియోల్ ఉన్నారు.
1950లలో సినీ రంగ ప్రవేశం చేసిన ధర్మేంద్ర, తన అందం, మానసిక బలం, సహజ నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించారు. ఆయన నటించిన చిత్రాలలో ‘షోలే’ ప్రత్యేక ప్రస్తావనకు అర్హం. అందులో ఆయన పోషించిన వీరు పాత్ర బాలీవుడ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది.
అలాగే ఆయన ‘అలీబాబా ఔర్ 40 చోర్’, ‘దోస్త్’, ‘డ్రీమ్ గర్ల్’, ‘సన్నీ’, ‘గాయల్’, ‘లోఫర్’, ‘మేరా నామ్ జోకర్’ వంటి అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు.
తన దశాబ్దాల సినీ ప్రయాణంలో అనేక అవార్డులు, గౌరవాలు అందుకున్న ధర్మేంద్ర, బాలీవుడ్‌లో సుస్థిర ముద్ర వేశారు. ఆయన మరణ వార్తతో సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర దుఃఖం వ్యక్తం చేస్తున్నారు.
ధర్మేంద్ర మరణంతో భారతీయ సినిమా రంగం ఓ అపూర్వ నటుడిని కోల్పోయిందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.

Post a Comment