-->

జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం – అదుపుతప్పి దుకాణాల్లోకి దూసుకెళ్లిన కారు

 

జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం –  అదుపుతప్పి దుకాణాల్లోకి దూసుకెళ్లిన కారు

మెదక్ జిల్లా, నార్సింగి: నవంబర్ 10: మెదక్ జిల్లా నార్సింగి మండలం వల్లూరు సమీపంలో సోమవారం ఉదయం జాతీయ రహదారి 44పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌ నుంచి నిజామాబాద్ వైపు వెళ్తున్న ఓ కారు, ముందుగా అకస్మాత్తుగా వచ్చిన ఆటోను తప్పించబోయే క్రమంలో అదుపుతప్పి రహదారి పక్కన ఉన్న టీ కొట్టు, కిరాణా దుకాణంలోకి దూసుకెళ్లింది.

ఈ ఘటనలో ఒకరు గాయపడ్డారు. అదే సమయంలో దుకాణం ముందు నిలిపి ఉంచిన ఒక ద్విచక్ర వాహనం పూర్తిగా ధ్వంసమైంది. ఘటన స్థలంలో పెద్ద శబ్దం రావడంతో స్థానికులు పరుగున చేరుకుని గాయపడిన వ్యక్తిని బయటకు తీశారు.

సమాచారం అందుకున్న నార్సింగి ఎస్‌ఐ సృజన, సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. గాయపడిన వ్యక్తిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.

➡️ ప్రమాదం వల్ల దుకాణాలకు తీవ్ర నష్టం, రహదారిపై కొంతసేపు ట్రాఫిక్ అంతరాయం.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793