-->

పాల్వంచలో సురక్షిత మంచినీటి కేంద్రం ప్రారంభించిన నవభారత్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్‌

 

పాల్వంచలో సురక్షిత మంచినీటి కేంద్రం ప్రారంభించిన నవభారత్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్‌

పాల్వంచ, నవంబర్‌ 12: నవభారత్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్‌ సంస్థ తన సామాజిక బాధ్యత (CSR) కార్యక్రమాల భాగంగా పట్టణ ఆరోగ్య కేంద్రం — శేఖర బంజర్‌ వద్ద 100 లీటర్ల సామర్థ్యం గల సురక్షిత మంచినీటి కేంద్రం మరియు సబ్మెర్సిబుల్‌ మోటార్‌ను ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి (DM&HO) డాక్టర్‌ తుకారాం రాథోడ్‌ బుధవారం ప్రారంభించారు.


ఈ సందర్భంగా మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ కృష్ణకుమారి మాట్లాడుతూ గత సంవత్సరం రోజులుగా ఆరోగ్య కేంద్రంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, రోగులు, సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఆ విషయం 'నవ లిమిటెడ్‌' యాజమాన్యానికి తెలియజేయగానే వారు సత్వరమే సురక్షిత మంచినీటి కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ సదుపాయంతో రోగులకు పరిశుభ్రమైన నీరు లభించి, నీటివల్ల వచ్చే వ్యాధులు నివారించవచ్చని పేర్కొన్నారు.

ముఖ్య అతిథి డాక్టర్‌ తుకారాం రాథోడ్‌ మాట్లాడుతూ “ఇప్పటివరకు నేను పని చేసిన ఏ జిల్లాలోనూ కార్పొరేట్‌ సంస్థలు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల కోసం ఇంత మంచి కార్యక్రమం చేపట్టడం చూడలేదు” అని 'నవ' గ్రూప్‌ సేవాభావాన్ని ప్రశంసించారు.

ఈ కార్యక్రమంలో జనరల్‌ మేనేజర్‌ (CSR) ఎం.జీ.ఎం. ప్రసాద్ మాట్లాడుతూ, “ఇప్పటికే పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రి, రామవరం తల్లి-పిల్లల ఆరోగ్య కేంద్రంలో ఆక్సిజన్‌ పాయింట్లు ఏర్పాటు చేశాం. ఈ సంవత్సరం పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల కోసం ఆధునిక వెయిటింగ్‌ హాల్‌ ఏర్పాటు చేయనున్నాం” అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో నవ లిమిటెడ్‌ డీ.జీ.ఎం (HR) శ్రీనివాసరెడ్డి, శేఖర బంజర్‌ గ్రామ పెద్ద బాలు నాయక్‌, కిషోర్‌, గాంధీనగర్‌ గ్రామ పెద్దలు రాము, లాలు, శంకర్‌, కిషన్‌, సి‌ఎస్‌ఆర్‌ సిబ్బంది రాజేష్‌, వెంకన్న‌, బాలు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793