గాంధీభవన్‌లో గాంధీజీ విగ్రహాల సేకరణ ప్రచార రథ ప్రారంభించిన టిపిసిసి అధ్యక్షులు
హైదరాబాద్, నవంబర్ 12 : గాంధీ జ్ఞాన్ ప్రతిష్టన్ స్వర్ణోత్సవాల సందర్భంగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచంలోనే ఎత్తైన మహాత్మా గాంధీజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే యోచనకు సంఘీభావంగా చేపట్టిన “లక్ష గాంధీజీ విగ్రహాల సేకరణ” కార్యక్రమ ప్రచార రథాన్ని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గాంధీభవన్ ప్రాంగణంలో జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ — “గాంధీజీ ఆశయాలు, అహింసా సిద్ధాంతాలు ప్రజల జీవితాల్లో మరింత ప్రేరణ కలిగించాలన్నదే ఈ కార్యక్రమం ఉద్దేశ్యం. తెలంగాణ నేల నుండి గాంధీజీ ఆలోచనల పునరుజ్జీవనానికి ఇది మార్గం కావాలి” అని పేర్కొన్నారు.
కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్లు కల్వ సుజాత, దీపక్ జాన్, గాంధీ విజ్ఞాన కేంద్రాల కమిటీ రాష్ట్ర కన్వీనర్ గాంధారి ప్రభాకర్, గాంధీ గ్యాన ప్రతిష్ఠ వైస్ చైర్మన్ కొత్తపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఆర్గనైజర్ అండ్ అడ్వైజర్ కె. రాజు నాగేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్ నీరుడు దయాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Post a Comment