-->

తండ్రిని కర్రతో హత్య చేసిన కొడుకు జగిత్యాల జిల్లా మెట్‌పల్లి ఘటన

 

తండ్రిని కర్రతో హత్య చేసిన కొడుకు జగిత్యాల జిల్లా మెట్‌పల్లి ఘటన

జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలోని బోయవాడలో ఆదివారం ఉదయం విషాద ఘటన చోటుచేసుకుంది. వివాహ సంబంధాలు చూడటం లేదన్న ఆగ్రహంతో ఓ కొడుకు తన తండ్రిని కర్రతో కొట్టి హత్య చేశాడు.

వివరాల్లోకి వెళ్తే— మెట్‌పల్లి బోయవాడకు చెందిన గంగ నర్సయ్య ఉదయం లేచి ఇంటి ప్రాంగణంలో ధ్యానం చేస్తున్న సమయంలో ఆయన కుమారుడు అన్వేష్ వివాహ విషయంపై వాదనకు దిగాడు. మాటామాట పెరిగి ఆగ్రహంతో పక్కనే ఉన్న కర్రతో తండ్రి నర్సయ్య తలపై తీవ్రంగా బాదాడు. దీంతో ఆయన తీవ్ర రక్తస్రావంతో కుప్పకూలిపోయాడు.

ఈ విషయాన్ని గుర్తించిన అన్వేష్ చిన్న అక్క భర్త నరేష్‌కు ఫోన్ చేసి గొడవ జరిగినట్లు తెలిపాడు. వెంటనే నరేష్ తన భార్య హారికతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడ్డ నర్సయ్యను మెట్‌పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ఆయన పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. అనంతరం చికిత్స నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ నర్సయ్య మరణించాడు.

ఈ ఘటనపై మృతుని కూతురు హరిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు మెట్‌పల్లి ఎస్సై పబ్బ కిరణ్‌కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

— అనుబంధ సమాచారం ప్రకారం, నిందితుడు అన్వేష్ పరారీలో ఉండగా, పోలీసులు వెతుకులాట చేపట్టారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793