దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుడు.. ఎర్రకోట పరిసరాల్లో ఉద్రిక్తత! 8 మంది మృతి
నవంబర్ 10, న్యూ ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ మరోసారి భయాందోళనకు గురైంది. చారిత్రక ఎర్రకోట సమీపంలోని మెట్రో పార్కింగ్ ప్రాంతంలో సోమవారం మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదు కార్లు పూర్తిగా దగ్ధమవగా, ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది.
ప్రత్యక్ష సాక్షుల ప్రకారం, గేట్ నెం.1 సమీపంలో పార్క్ చేసిన ఒక కారులో ఆకస్మికంగా పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. వెంటనే మంటలు చెలరేగి సమీపంలో ఉన్న వాహనాలకు కూడా వ్యాపించాయి. క్షణాల్లోనే ఐదు కార్లు పూర్తిగా మంటల్లో దగ్ధమయ్యాయి. స్థానికులు భయంతో పరుగులు తీశారు.
వార్త అందుకున్న వెంటనే ఫైర్ సర్వీస్ బృందాలు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు.
ఈ ఘటనపై ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ బృందం దర్యాప్తు ప్రారంభించింది. పేలుడు కారణాలు ఇంకా తెలియరాలేదు. ఇది అప్రమత్తత లోపమా, లేక ఉద్దేశపూర్వక దాడా అనే కోణంలో అధికారులు అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నారు. బాంబ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ టీములు సంఘటన స్థలంలో సాక్ష్యాలను సేకరిస్తున్నాయి.
ఎర్రకోట ప్రాంతం పర్యాటక రద్దీ ఎక్కువగా ఉండే ప్రదేశం కావడంతో పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. పరిసర ప్రాంతాల్లో మెట్రో రైళ్లను తాత్కాలికంగా నిలిపివేశారు.
ఢిల్లీ పోలీస్ కమిషనర్ స్వయంగా ఘటన స్థలాన్ని పరిశీలించారు. “పేలుడు కారణాలను త్వరలోనే బయటపెడతాం. ప్రస్తుతానికి ప్రజలు పుకార్లను నమ్మవద్దు” అని కమిషనర్ విజ్ఞప్తి చేశారు.

Post a Comment