విద్యార్థి తల్లితో అసభ్యంగా ప్రవర్తించిన గురుకుల ప్రిన్సిపాల్.. కేసు నమోదు
విద్యార్థి తల్లితో అసభ్యంగా ప్రవర్తించిన గురుకుల ప్రిన్సిపాల్.. కేసు నమోదు
వికారాబాద్: విద్యార్థి తల్లితో ఓ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు రావడం వికారాబాద్ జిల్లాలో కలకలం రేపింది. యాలాల మండల పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
పోలీసులు, బాధితురాలి కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. యాలాల మండల పరిధిలోని పులే గురుకుల పాఠశాలలో ఓ గ్రామానికి చెందిన బాలుడు తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. కుమారుడిని చూసేందుకు అతడి తల్లి పలుమార్లు పాఠశాలకు వెళ్లేది. ఈ క్రమంలో ప్రిన్సిపాల్ మెగావత్ నరేష్‌తో ఆమెకు పరిచయం ఏర్పడినట్లు తెలుస్తోంది.
ఆ పరిచయాన్ని ఆసరాగా చేసుకుని ప్రిన్సిపాల్ ఫోన్‌లో తనతో అసభ్యంగా మాట్లాడేవాడని బాధితురాలు కుటుంబ సభ్యులకు తెలిపినట్లు సమాచారం. మంగళవారం కుమారుడిని పాఠశాలలో కలిసి బయటకు వస్తున్న సమయంలో ప్రిన్సిపాల్ ఆమెతో మాట్లాడాడు. అనంతరం ఆమె నడుచుకుంటూ వెళ్తుండగా కారులో ఎక్కాలని కోరినట్లు తెలుస్తోంది.
ఆమె కారులో ఎక్కిన అనంతరం అగ్గనూరు గ్రామ శివారులోకి వెళ్లగా.. అక్కడ ప్రిన్సిపాల్ తనతో అసభ్యంగా ప్రవర్తించినట్లు బాధితురాలు ఆరోపించింది. వెంటనే ఆమె తన కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో వారు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ప్రిన్సిపాల్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు అతడిపై దాడి చేసినట్లు సమాచారం.
అనంతరం బాధితురాలి కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి ఘటనపై దర్యాప్తు చేపట్టారు. బాధితురాలి ఆరోపణలు, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు విచారిస్తున్నారు. పోలీసుల దర్యాప్తు పూర్తయిన తర్వాతే అసలు విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

Post a Comment