రెస్టారెంట్లలో ఎక్స్‌పైర్డ్ మాంసం.. మళ్లీ వాడుతున్న వంట నూనె గుర్తింపు
హైదరాబాద్: తెలంగాణలోని పలు ఫుడ్ ఎస్టాబ్లిష్‌మెంట్లలో TGSAFE అధికారులు నిర్వహించిన తనిఖీల్లో ఆహార భద్రత నిబంధనల ఉల్లంఘనలు వెలుగులోకి వచ్చాయి. మాదాపూర్‌లోని మానెస్టరీ ఆంఫీ బ్రూవరీ, వరంగల్‌లోని అల్ఫారామ్ హోటల్, కామారెడ్డిలోని మాల్గుడి రెస్టారెంట్‌లలో అధికారులు తనిఖీలు చేపట్టారు.
తనిఖీల సందర్భంగా గడువు ముగిసిన పచ్చి నాన్‌వెజ్ మాంసం, ఫ్రీజర్లలో నిల్వ చేసిన వండిన ఆహారం, లేబుల్స్ లేని ఆహార పదార్థాలను అధికారులు గుర్తించారు. అదేవిధంగా సుమారు 5 కిలోల మళ్లీ వాడిన వంట నూనె కూడా గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
కొన్ని చోట్ల లేబుల్ లేని సింథటిక్ ఫుడ్ కలర్, గడువు ముగిసిన ఆహార పదార్థాలు, పగిలిన గుడ్లు కూడా తనిఖీల్లో బయటపడ్డాయి. ఆహార పదార్థాలను సరైన విధంగా నిల్వ చేయకపోవడం, లేబులింగ్ నిబంధనలు పాటించకపోవడం వంటి ఉల్లంఘనలను అధికారులు గుర్తించారు.
ఈ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి వరంగల్‌లోని అల్ఫారామ్ హోటల్‌కు ఇంప్రూవ్‌మెంట్ నోటీసు జారీ చేసినట్లు తెలిపారు. ఆహార భద్రతా ప్రమాణాలను పాటించాలని, వినియోగదారులకు సురక్షితమైన ఆహారాన్ని అందించాలని అధికారులు సూచించారు.

Post a Comment