-->

తూప్రాన్‌లో వినాయక నిమజ్జన ఏర్పాట్లపై అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన

 

తూప్రాన్‌లో వినాయక నిమజ్జన ఏర్పాట్లపై అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన

తూప్రాన్‌లో వినాయక నిమజ్జన ఏర్పాట్లపై అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన

అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు

తూప్రాన్, సెప్టెంబర్ 11: వినాయక చవితి సందర్భంగా తూప్రాన్ పట్టణంలో నిర్వహించనున్న వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు అధికారులు ముందస్తు ఏర్పాట్లపై దృష్టి సారించారు.

వినాయక నిమజ్జనానికి సంబంధించిన ప్లాన్ ఆఫ్ యాక్షన్‌లో భాగంగా తూప్రాన్ పెద్దచెరువు నిమజ్జన ప్రాంతాన్ని ఆర్డీఓ బావయ్య, డీఎస్పీ నరేందర్ గౌడ్, సీఐ వెంకటరాజు గౌడ్, ఎస్సై గంగరాజు, తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రమేష్ తదితర అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా నిమజ్జన ప్రాంతంలో చేపట్టాల్సిన ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, పోలీసు భద్రత, వాహనాల రాకపోకలు, విగ్రహాల నిమజ్జనం సజావుగా జరిగేలా తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలను అధికారులు పరిశీలించారు. నిమజ్జన సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన మౌలిక వసతులు, భద్రతా చర్యలను ముందుగానే పూర్తి చేయాలని సూచించారు.

అలాగే నిమజ్జన కార్యక్రమం సందర్భంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించారు.

వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలను ముందస్తుగానే పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు.

Blogger ఆధారితం.