గణేష్ మండపాన్ని సందర్శించిన టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు
గణేష్ మండపాన్ని సందర్శించిన టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు
కొత్తగూడెం: కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచ హమాలీ కాలనీ 5వ డివిజన్‌లో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపాన్ని టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు యాదవ్ సందర్శించారు. ఈ సందర్భంగా గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారి ఆశీస్సులు స్వీకరించారు.
అనంతరం నాగా సీతారాములు మాట్లాడుతూ.. విఘ్నాలను తొలగించే గణనాథుని కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. భక్తిశ్రద్ధలతో గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్న ఉత్సవ కమిటీ సభ్యులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ సిరిపురపు లలిత, పాల్వంచ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నూకల రంగారావు, 5వ డివిజన్ కార్పొరేటర్ నూకల సరిత, 45వ డివిజన్ కార్పొరేటర్ దంతెబోయిన నరేష్, ఓబీసీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు జయప్రకాష్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు లోగాని మురళి, యువజన కాంగ్రెస్ నాయకులు తేజావత్ శ్రీను, కోటేష్ నాయక్, సాయి చంద్ తదితరులు పాల్గొన్నారు.
అలాగే గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, హమాలీ కాలనీ వాసులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Post a Comment