అనారోగ్య బాధితులను పరామర్శించి భరోసా కల్పించిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి
అనారోగ్య బాధితులను పరామర్శించి భరోసా కల్పించిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి
కొత్తగూడెం: బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, కష్టసమయాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలకు అన్ని విధాలుగా తోడుగా నిలుస్తామని మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం కొత్తగూడెం టౌన్ పరిధిలోని రామవరం ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి ఆమె పర్యటించి, అనారోగ్యంతో బాధపడుతున్న పార్టీ నాయకులను పరామర్శించారు.
ఈ పర్యటనలో భాగంగా ఇటీవల సైనస్ సర్జరీ చేయించుకుని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న బీఆర్ఎస్ నాయకుడు పూర్ణను కాపు సీతాలక్ష్మి కలిశారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అదే విధంగా పూర్ణ తండ్రి బానోత్ సాంగు కిడ్నీ సమస్యతో బాధపడుతున్న విషయం తెలుసుకుని, ఆయనతో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఎలాంటి ఆందోళన చెందవద్దని, పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా కల్పించారు.
అనంతరం ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై చికిత్స పొందుతున్న రామవరం ప్రాంతానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు ఖాజాను ఆమె పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అనారోగ్యం, ప్రమాదాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పార్టీ నాయకులు, కార్యకర్తలకు నైతికంగా అండగా నిలవడం తమ బాధ్యత అని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తను బీఆర్ఎస్ కుటుంబ సభ్యుడిగా భావిస్తామని, కార్యకర్తలకు కష్టాలు ఎదురైనప్పుడు వారికి అండగా నిలిచి ధైర్యం కల్పిస్తామని కాపు సీతాలక్ష్మి తెలిపారు. కార్యకర్తల సంక్షేమానికి పార్టీ ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు.
ఈ పరామర్శ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తోగరు రాజశేఖర్, ఖాజా భక్ష్, షరీఫ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment