ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు
భేటీలో పాల్గొన్న టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు యాదవ్
కొత్తగూడెం/ఢిల్లీ, అక్టోబర్ 13: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను తెలంగాణ రాష్ట్రానికి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, డీసీసీ అధ్యక్షులతో పాటు టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాల గురించి ఖర్గే ఆరా తీసినట్లు తెలిసింది. రాష్ట్రంలో పార్టీ కార్యకలాపాలు, ప్రభుత్వ కార్యక్రమాల అమలు తదితర అంశాలపై ఈ భేటీలో చర్చించినట్లు సమాచారం.
ఈ కార్యక్రమంలో తెలంగాణకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Post a Comment