ఐదేళ్ల బాలికపై లైంగిక దాడి.. నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష

ఐదేళ్ల బాలికపై లైంగిక దాడి.. నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష


ఐదేళ్ల బాలికపై లైంగిక దాడి.. నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష

హైదరాబాద్, నవంబర్ 4: ఐదేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి రంగారెడ్డి జిల్లా ప్రత్యేక న్యాయస్థానం 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. అంతేకాకుండా బాధిత బాలికకు రూ.3 లక్షల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది.

వివరాల్లోకి వెళ్తే.. 2021 ఆగస్టు 17న మియాపూర్‌లోని మార్తాండనగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. కిరాణా దుకాణానికి వెళ్తున్న ఐదేళ్ల బాలికను నిందితుడు కీలా ధర్మ వెంబడించాడు. అనంతరం అపార్ట్‌మెంట్ లిఫ్ట్ వద్ద బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.

ఆ సమయంలో నిందితుడు గచ్చిబౌలిలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీ, సాక్షుల గుర్తింపు ఆధారంగా నిందితుడిని అరెస్టు చేశారు.

ఈ కేసులో విచారణ పూర్తిచేసిన రంగారెడ్డి జిల్లా ప్రత్యేక కోర్టు నిందితుడు కీలా ధర్మకు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. బాధిత బాలికకు రూ.3 లక్షల పరిహారం అందించాలని ఆదేశించింది.


Blogger ఆధారితం.