గ్రాడ్యుయేట్ల గొంతుకగా డాక్టర్ భూసిరెడ్డి శంకర్‌రెడ్డి

 

నల్లగొండ–వరంగల్–ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా టీఆర్‌ఎస్ (డెమోక్రటిక్) ఎంపిక


గ్రాడ్యుయేట్ల గొంతుకగా డాక్టర్ భూసిరెడ్డి శంకర్‌రెడ్డి

నల్లగొండ–వరంగల్–ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా టీఆర్‌ఎస్ (డెమోక్రటిక్) ఎంపిక

కొత్తగూడెం, నవంబర్ 5 : నల్లగొండ–వరంగల్–ఖమ్మం ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా డాక్టర్ భూసిరెడ్డి శంకర్‌రెడ్డిని టీఆర్‌ఎస్ (డెమోక్రటిక్) పార్టీ నియమించింది. ఈ విషయాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నరాల సత్యనారాయణ వెల్లడించారు.

డాక్టర్ భూసిరెడ్డి శంకర్‌రెడ్డి గతంలో రోటరీ ఇంటర్నేషనల్ గవర్నర్‌గా విశేష సేవలందించారని, కరోనా మహమ్మారి సమయంలో వేలాది మందికి సహాయ సహకారాలు అందించారని నరాల సత్యనారాయణ తెలిపారు. రాజకీయ, సామాజిక రంగాల్లో అనుభవం ఉన్న ఆయనకు పట్టభద్రులు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు.

గ్రాడ్యుయేట్లు, నిరుద్యోగులు, ఉద్యోగుల సమస్యల పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యమని పార్టీ పేర్కొంది. ఉద్యోగం, ఉపాధి, విద్య, ఆర్థిక భరోసా అంశాలను ఎన్నికల ప్రధాన ఎజెండాగా ముందుకు తీసుకెళ్తామని తెలిపింది.

పట్టభద్రుల హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం పోరాడుతామని, ప్రతి నియోజకవర్గంలో ప్రత్యేక కార్యాలయాలు ఏర్పాటు చేసి గ్రాడ్యుయేట్ల ప్రతినిధులతో కమిటీలను ఏర్పాటు చేస్తామని పార్టీ వెల్లడించింది. ప్రతి మూడు నెలలకు ఒకసారి సమావేశాలు నిర్వహించి పట్టభద్రుల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపింది.

“సామాజిక తెలంగాణ, సామాజిక న్యాయం” తమ పార్టీ ప్రధాన నినాదమని నరాల సత్యనారాయణ స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ పదవి హోదా కోసం కాకుండా పట్టభద్రుల హక్కుల సాధన కోసం పనిచేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.

డాక్టర్ శంకర్‌రెడ్డి అభ్యర్థిత్వానికి ప్రజా సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాలు, న్యాయవాద సంఘాలు, ఉద్యోగ సంఘాలు మద్దతు ప్రకటించినట్లు ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఎమ్మెల్సీ ఇన్‌చార్జి కాంపెల్లి ప్రభు కుమార్, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్‌చార్జి సాధు శంకర్, భద్రాచలం ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్‌చార్జి సింగతి నందకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.