స్కూల్ విద్యార్థుల యూనిఫామ్ లు కుట్టే పని మహిళా సంఘాలకే అప్పగిస్తాం: ఐటీ మంత్రి శ్రీధర్ బాబు
స్కూల్ విద్యార్థుల యూనిఫామ్ లు కుట్టే పని మహిళా సంఘాలకే అప్పగిస్తాం: ఐటీ మంత్రి శ్రీధర్ బాబు*
పెద్దపల్లి జిల్లా: తెలంగాణ లో స్థాపించ బడిన నేషనల్ అకాడమీ అఫ్ కన్స్టక్షన్ (న్యాక్ ) లేబర్ డిపార్ట్మెంట్ వారి సంయుక్త ఆధ్వర్యంలో మంథని కాంగ్రెస్ క్యాంప్ కార్యాలయంలో కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం ఈరోజు నిర్వహించారు..
ప్రస్తుత సమాజంలో మంచి నైపుణ్యం గల వ్యక్తులు విద్యా వంతుల కంటే అధికంగా ఆదాయం సంపాదిస్తున్నారని, మంచి నైపుణ్యత ఉంటే మెరుగైన ఆదాయం సాధ్యమవుతుం దని రాష్ట్ర ఐటి, మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు అన్నారు.
బుధవారం రాష్ట్ర ఐటి, పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె.అరుణ శ్రీ తో కలిసి మంథనిలోని తన క్యాంపు కార్యాలయంలో న్యాక్ ఆధ్వర్యంలో కుట్టు మిషన్ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికెట్ అందజేశారు.
*ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ...*
మహిళలకు మంచి నైపు ణ్యం ఉంటే దేశ,విదేశాలలో మంచి ఆదాయంతో అనేక ఉపాధి అవకాశాలు లభిస్తా యని అన్నారు. ప్రస్తుతం ఇంజనీరింగ్ చదివిన గ్రాడ్యుయేట్ ల కంటే శిక్షణ పొంది నైపుణ్యం కల్గిన ప్లంబర్, కార్పెంటర్.... మొదలగు వృత్తుల వారు అధికంగా సంపాదిస్తున్నా రని మంత్రి తెలిపారు.
కుట్టు మిషన్లలో శిక్షణ పూర్తి చేసుకున్న ప్రతి మహిళకు కుట్టు మిషన్ ఉచితంగా పంపిణీ చేస్తామని,ప్రభు త్వం తరఫున అవకాశం ఉన్న మేరకు మహిళా సంఘాలకు దుస్తులను కుట్టే ఆర్డర్లు అందిస్తామని, స్కూల్ విద్యార్థుల ఏకరూప దుస్తులను సైతం మహిళా సంఘాల చేతనే కుట్టించా మని మంత్రి పేర్కొన్నారు.
యువతకు మంచి నైపుణ్యాలతో శిక్షణ అందించే దిశగా పెద్దపల్లిలో టాస్క్ కేంద్రం ఏర్పాటు చేశామని, అదేవిధంగా మంథనిలో సైతం ట్రెడ్స్ సంబంధిత శిక్షణా కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని అన్నారు.
మహిళా సాధికారత దిశగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్ర మంలో మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పి.రమ, మంథిని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్య కర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు...

Post a Comment