బక్రీద్ పండుగ సందర్భంగా ఈద్గా, ఖబరస్తాన్ శుభ్రపర్చాలని చైర్ పర్సన్ కు వినతి పత్రం ఇచ్చిన ముస్లింలు
బక్రీద్ పండుగ సందర్భంగా ఈద్గా, ఖబరస్తాన్ శుభ్రపర్చాలని చైర్ పర్సన్ కు వినతి పత్రం ఇచ్చిన ముస్లింలు
కొత్తగూడెం మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి కు రామవరం ముస్లిం పెద్దలు 17వ తేదీన బక్రీద్ పండుగా సందర్భంగా ఈద్గా మరియు ఖబరాస్తాన్ శుభ్రం చేయించుట మరియు ఈద్గా, ఖబరస్తాన్ లో బోరు వేయించుట గురించి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే, అధికారుల దృష్టికి తీసుకొని వెళ్లి త్వరలో పనులు ప్రారంభిస్తాను అన్నారు.
ఈ కార్యక్రమంలో రామవరం ముస్లిం పెద్దలు. ఎస్.కె షమ్మీ. ఎండి మైనుద్దీన్, ఎండీ ఖాజా బాక్ష్, ఎస్ కే బాబు జానీ, ఎస్కే రహీం, ఎస్.కె షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment