ఎమ్మెల్సీ ఎన్నికల కోసం బాధ్యతతో ఓటు నమోదు చేసుకోండి: ఎంఐఎం అధ్యక్షులు మోహీద్ పటేల్
ఎమ్మెల్సీ ఎన్నికల కోసం బాధ్యతతో ఓటు నమోదు చేసుకోండి: ఎంఐఎం అధ్యక్షులు మోహీద్ పటేల్
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించేందుకు ఓటును ఆఫ్‌లైన్ లేదా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని నారాయణఖేడ్ ఎంఐఎం అధ్యక్షులు, న్యాయవాది మోహీద్ పటేల్ పటేల్ పిలుపునిచ్చారు. రాబోయే ఉమ్మడి జిల్లా మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల, టీచర్ల శాసనమండలి ఎన్నికల్లో ఓటరు హక్కు వినియోగించేందుకు 2021 అక్టోబర్ 31 నాటికి డిగ్రీ పూర్తిచేసిన వారు అర్హులని తెలిపారు.
అర్హులైన వారు ఫారం-18ను పూర్తిచేసి నవంబర్ 6లోపు తమ ఓటు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన బాధ్యత ఉందని మోహీద్ పటేల్ సూచించారు.

Post a Comment