-->

బస్సులో మరోసారి చెప్పులతో కొట్టుకున్న మహాలక్ష్మిలు

బస్సులో మరోసారి చెప్పులతో కొట్టుకున్న మహాలక్ష్మిలు


హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందుబాటులోకి తేవడంతో, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం రోజురోజుకు పెరుగుతోంది. అయితే, అదే సమయంలో సీటు కోసం గొడవలు, వాగ్వాదాలు కూడా ఎక్కువవుతున్నాయి. సీటు దొరకడం చాలా మహిళలకు కష్టంగా మారిపోతోంది.

తాజాగా, హైదరాబాద్‌లోని హాకీంపేట సమీపంలో నడుస్తున్న ఆర్టీసీ బస్సులో ముగ్గురు మహిళలు ఎక్కారు. వారిలో ఇద్దరు సీటు కోసం తగాదా పెట్టుకున్నారు. మొదటిస్థాయిలో మాటల యుద్ధంగా మొదలైన ఈ గొడవ కాస్తా మరింత తీవ్రమై, ఒకరిపై ఒకరు దాడికి దిగేంతవరకు వెళ్లింది. మరో మహిళ ఒకరికి మద్దతు ఇవ్వడంతో పరిస్థితి అదుపుతప్పి, చెప్పులతో పరస్పరం కొట్టుకునే స్థాయికి చేరుకుంది.

బస్సులో ప్రయాణికులు పెద్ద సంఖ్యలో ఉండటంతో గొడవ మరింత పెరిగింది. తోటి ప్రయాణికులు వారిని శాంతింపజేయాలని ప్రయత్నించినా, వారు ఎవరూ వినిపించుకోలేదు. బస్సు కండక్టర్ వారిని సముదాయించే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోవడంతో, చివరికి బస్సును బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి, అక్కడ ఫిర్యాదు చేశారు.

పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో, గొడవకు కారణమైన మహిళలు మద్యం సేవించి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి, విచారణ జరుపుతున్నారు.

ఈ తరహా ఘటనలు ఇటీవల ఎక్కువవుతున్నాయని, ఉచిత ప్రయాణాన్ని సద్వినియోగం చేసుకోవాలే తప్ప, దుర్వినియోగం చేయొద్దని అధికారులు సూచిస్తున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793