నవ మహిళా సాధికార కేంద్రంలో యోగ్యత పత్రాల ప్రధాన కార్యక్రమం (వీడియో)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని నవ లిమిటెడ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన నవ మహిళా సాధికార కేంద్రం లో డీటీపీ & టాలీ కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులకు యోగ్యత పత్రాల ప్రధాన బహుకరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.
ఈ కార్యక్రమానికి జాంబియాలోని ముసుము రిసోర్సెస్ లిమిటెడ్ ప్రతినిధులు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డా. సిక్స్టస్ ములెంగా మరియు అడ్వైసర్ మ్ర అర్బనో ములెంగా మూటటి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
మహిళా సాధికారత కోసం ఉచిత శిక్షణ – ఉపాధి అవకాశాలు
ఈ సందర్భంగా టాలీ కోర్సు లో శిక్షణ పొందిన భార్గవి మాట్లాడుతూ, నవ మహిళా సాధికార కేంద్రం మాదిరిగా ఎన్నో మహిళలకు ఉచితంగా శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది, ఇది ఎంతో మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను తెచ్చిపెడుతోంది, అని పేర్కొన్నారు, అనంతరం, అతిథులచేత డీటీపీ మరియు టాలీ శిక్షణ పూర్తి చేసిన విద్యార్థినులకు యోగ్యత పత్రాలను అందజేశారు.
నవ లిమిటెడ్ సి.ఎస్.ఆర్. కార్యక్రమాలు
నవ లిమిటెడ్ జనరల్ మేనేజర్ (సి.ఎస్.ఆర్) ఎం.జి.ఎం ప్రసాద్ మాట్లాడుతూ, నవ మహిళా సాధికార కేంద్రం ద్వారా శిక్షణ ఇచ్చిన మహిళలు తాము తయారు చేసిన వస్తువులను వివిధ దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదుగుతున్నారు, ఇది కేవలం శిక్షణకే పరిమితం కాకుండా ఉపాధి అవకాశాలను కూడా అందిస్తోంది అని తెలిపారు.
చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ సిక్స్టస్ ములెంగా మాట్లాడుతూ, నవ లిమిటెడ్ సి.ఎస్.ఆర్ కింద చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమైనవి ఇలాంటి శిక్షణా కేంద్రాలు మరింత విస్తరించాలి అని ప్రశంసించారు.
శిక్షణ పొందిన విద్యార్థినుల అభినందన
నవ లిమిటెడ్ డైరెక్టర్ (బిజినెస్ డెవలప్మెంట్) సి వి దుర్గాప్రసాద్ మాట్లాడుతూ, ఇక్కడ శిక్షణ పొందిన విద్యార్థినులు తమ జీవితాలను మెరుగుపర్చుకోవడం చూస్తే ఎంతో ఆనందంగా ఉంది, యువతికి శిక్షణ యొక్క ప్రాముఖ్యతను తెలియజేసి, మరింత మంది ఇందులో చేరేలా ప్రోత్సహించాలి అని సూచించారు
వివిధ కేంద్రాల సందర్శన
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముసుము రిసోర్సెస్ లిమిటెడ్ ప్రతినిధులు నవ భారత్ నేత్ర వేద్య కేంద్రం, నవ భారత్ పాఠశాల, వృత్తి విద్య కేంద్రాన్ని సందర్శించి అక్కడ చేపడుతున్న సేవలను పరిశీలించారు
ఈ కార్యక్రమంలో సి హెచ్ శ్రీనివాసరావు, టి అరుణ, బి అరుణ, కవిత, శిరీష, అముద, రమేష్, రాజేశ్వరావు, శ్రీకాంత్, రాజేష్ మరియు శిక్షణ పొందిన విద్యార్థినులు పాల్గొన్నారు ఈ కార్యక్రమం మహిళా సాధికారతకు, యువత ఉపాధికి దోహదపడే గొప్ప ప్రయత్నంగా నిలిచింది.

Post a Comment