ఏజెన్సీ ప్రాంత ఎస్సి కులాల అభివృద్ధికి బడ్జెట్ లోటు
ఏజెన్సీ ప్రాంత ఎస్సి కులాల అభివృద్ధికి బడ్జెట్ లోటు - హక్కుల పోరాట సమితి ఆందోళన
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌లో ఏజెన్సీ ప్రాంత ఎస్సి కులాల అభివృద్ధికి తగినన్ని నిధులు కేటాయించకపోవడంతో, వారి అభివృద్ధి కుంటుపడుతోందని షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి ఆందోళన వ్యక్తం చేసింది.
సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బొమ్మెర శ్రీనివాసు గురువారం సింగరేణి ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల కార్యాలయం నుండి మాట్లాడుతూ, ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ ఏజెన్సీ ప్రాంతంలోని ఎస్సి కులాల అభివృద్ధికి ఉపయోగపడటం లేదని విమర్శించారు. ముఖ్యంగా, రైతుల సంక్షేమం, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు, తదితర అంశాల్లో ఎలాంటి అభివృద్ధి కనిపించడం లేదని తెలిపారు.
ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలనలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఏనముల రేవంత్ రెడ్డి ఈ సమస్యపై దృష్టి పెట్టి, ఏజెన్సీ ప్రాంత ఎస్సి కులాలను అన్ని విధాల ఆదుకోవాలని సమితి విజ్ఞప్తి చేసింది. రాష్ట్రం మొత్తానికి ఎస్సి, ఎస్టీల అభివృద్ధి కోసం బడ్జెట్ కేటాయించినప్పటికీ, ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే ఎస్సి కులాలు ఇంకా అభద్రతలో ఉన్నాయని, వారి బతుకులు మారడం లేదని శ్రీనివాసు ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన స్పందించి, తగిన చర్యలు తీసుకోవాలని షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి డిమాండ్ చేసింది.

Post a Comment