-->

తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్‌గా ఆకునూరి మురళి రాజీనామా

తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్‌గా ఆకునూరి మురళి రాజీనామా

ఆకునూరి మురళి తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావుకు తన రాజీనామా పత్రాన్ని పంపించారు.

తాను చేపట్టిన ప్రధాన బాధ్యత అయిన తెలంగాణ రాష్ట్ర విద్యా విధానంపై సిఫార్సులతో కూడిన సమగ్ర నివేదిక సమర్పణ పూర్తయిందని, అందువల్ల పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆకునూరి మురళి తన లేఖలో పేర్కొన్నారు.

ఇంకా నాలుగు నెలల పదవీకాలం మిగిలి ఉన్నప్పటికీ ముందుగానే ఆయన రాజీనామా చేయడం రాష్ట్ర రాజకీయ, విద్యా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆయన రాజీనామా వెనుక ఇతర కారణాలు ఉన్నాయా అనే అంశంపై కూడా రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

తెలంగాణ విద్యా వ్యవస్థలో సంస్కరణలు, ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, కొత్త విద్యా విధానంపై సూచనలు ఇవ్వడంలో ఆకునూరి మురళి కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం ఆయన సమర్పించిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై దృష్టి సారించబడుతోంది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793