కొత్తగూడెం నూతన డీఈఓగా వాసంతి బాధ్యతల స్వీకరణ
కొత్తగూడెం నూతన డీఈఓగా వాసంతి బాధ్యతల స్వీకరణ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన జిల్లా విద్యాశాఖ అధికారిణి (డీఈఓ)గా శ్రీమతి డి. వాసంతి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆమెకు అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీ) శ్రీ శంభు ప్రసాద్‌తో పాటు కార్యాలయ సిబ్బంది పుష్పగుచ్ఛం అందించి ఘనంగా స్వాగతం పలికారు.
బాధ్యతలు చేపట్టిన అనంతరం వాసంతి జిల్లా కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు ప్రతీకగా జిల్లా కలెక్టర్‌కు మొక్కను అందజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన డీఈఓ వాసంతి, జిల్లాలో విద్యా ప్రమాణాల మెరుగుదల కోసం ప్రత్యేక చర్యలు చేపడతానని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, విద్యార్థుల విద్యా ఫలితాల పెంపు, ప్రభుత్వ విద్యా కార్యక్రమాల సమర్థవంతమైన అమలు, ఉపాధ్యాయుల సమన్వయంతో నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.
జిల్లాలో విద్యా రంగ అభివృద్ధికి అందరి సహకారం అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొని నూతన డీఈఓకు శుభాకాంక్షలు తెలిపారు.

Post a Comment