ఛత్తీగఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ 8 మంది నక్సల్స్ మృతి
ఛత్తీగఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. నారాయణ్‌పూర్ జిల్లాలో పోలీసులకు, నక్సలైట్లకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 8 మంది నక్సలైట్లు మృతి చెందారు. రెండు రోజులుగా ఎదరు కాల్పులు కొనసాగుతున్నాయి. కుతుల్, ఫరస్‌బేడ, కొడతమెట్ట సరిహద్దు ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ ఘటన జరిగింది. ఇద్దరు జవాన్లకు గాయాలు కావడంతో స్థానిక ఆసుపత్రికి తరలించారు.
అబూజ్మడ్ అడవుల్లో డీఆర్జీ, ఎస్టీ ఎఫ్, కోబ్రా దళాలు సంయుక్తంగా నక్సల్స్ ఏరివేత ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులకు, నక్సలైట్లకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.
ఇటీవల నారాయణపూర్-దంతేవా-కొండగావ్ అంతర్ జిల్లా సరిహద్దులో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు.

Post a Comment