బస్సు కింద పడి ఇంటర్ విద్యార్థిని మృతి
హైదరాబాదులో హృదయవిధారక ఘటన చోటుచేసుకుంది. బస్సు కింద పడి ఇంటర్ విద్యార్థిని మృతి చెందింది. ఈ ఘటన హైదరాబాద్ లోని యూసఫ్‌గూడాలో ఈ రోజు సాయంత్రం వెలుగు చూసింది.
ఆర్టీసీ బస్సు ఎక్కుతూ కాలుజారి ఓ విద్యార్థిని బస్సు చక్రాల కింద పడి మృతి చెందింది. ఈ నేపథ్యంలో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
స్థానికుల సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కాగా మృతి చెందిన విద్యార్థినిని యూసఫ్‌గూడాలోని మాస్టర్స్ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న మెహరీన్‌గా గుర్తించారు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ధర్యాప్తు చేపట్టారు.

Post a Comment