భారీ పేలుడు. ఆరుగురు మృతి పలువురికి గాయాలు
భారీ పేలుడు. ఆరుగురు మృతి పలువురికి గాయాలు
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని బూర్గులలో ఉన్న సౌత్ గ్లాసు కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. కంప్రెషర్ పేలడంతో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
పలువురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. బాధితుల్లో ఎక్కువ మంది ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులు ఉన్నారు. క్షతగ్రాతులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వివరాలోకి వెలుతే
సౌత్ గ్లాస్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలు శుక్రవారం జరిగిన ఘోర ప్రమాదంలో రియాక్టర్ పెళ్లి సంఘటన స్థలంలో ఆరు గురు మృత్యువాత పడ్డట్టు స్థానిక ఆర్డిఓ వెంకట మాధవరావు తెలిపారు. ఆర్డీవో మాధవరావు తెలిపిన ప్రకారం పరిశ్రమలో పనిచేస్తున్న ఉత్తర ప్రదేశ్ కు చెందిన నికిత్ కుమార్ (22), ఉత్తర ప్రదేశ్ కు చెందిన రామ్ సెత్ (24), బీహార్ కు చెందిన రామ్ ప్రకాష్ (31), చిత్తరంజన్ (31) ఒరిస్సాకు చెందిన రతికాంత్ (25) అనే యువ కార్మికులు దుర్మరణం పాలైనట్టు స్పష్టం చేశారు.

Post a Comment