బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయుడిని పట్టుకుని ఏడ్చేసిన విద్యార్థులు
బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయుడిని పట్టుకుని ఏడ్చేసిన విద్యార్థులు
సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం: తమను వదిలి వెళ్లిపోవద్దంటూ టీచర్ ను పట్టుకుని ఏడ్చేసిన విద్యార్థులు. మద్దిరాల (మం) పోలుమల్ల జడ్పీహెచ్ఎస్ పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు మెంతబోయిన సైదులును పట్టుకొని ఏడ్చేసిన విద్యార్థులు
సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం పోలుమల్ల గ్రామంలో బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయుడిని చూసి పిల్లలు భావోద్వేగానికి గురయ్యారు. వివరాల్లోకెళ్తే పోలుమల్ల జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న మెంతబోయిన సైదులు బదిలీపై వెళ్తుండడంతో తమను వదిలి వెళ్లిపోవద్దంటూ టీచర్ ను పట్టుకొని విద్యార్థులు ఏడ్చారు. విద్యార్థులు ఉపాధ్యాయుడి కాళ్ళ మీద పడి మరి వెళ్ళిపోవద్దంటూ ప్రాధేయపడ్డారు.

Post a Comment