-->

మణుగూరు ఏరియాలో కార్మికుల ఆవేదన.. బేసిక్, వేజ్‌ ప్రొటెక్షన్‌ లేక తీవ్ర నష్టం

 

మణుగూరు ఏరియాలో కార్మికుల ఆవేదన.. బేసిక్, వేజ్‌ ప్రొటెక్షన్‌ లేక తీవ్ర నష్టం

మణుగూరు ఏరియాలో కార్మికుల ఆవేదన.. బేసిక్, వేజ్‌ ప్రొటెక్షన్‌ లేక తీవ్ర నష్టం

మణుగూరు, సెప్టెంబర్ 3: మణుగూరు ఏరియాలో సర్ఫేస్ జనరల్ అసిస్టెంట్‌గా నియమితులైన కార్మికులకు బేసిక్, వేజ్‌ ప్రొటెక్షన్‌ లేకపోవడంతో తీవ్ర ఆర్థిక నష్టం జరుగుతోందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివిధ ఏరియాల నుంచి మణుగూరు సర్ఫేస్‌కు బదిలీపై వచ్చిన కార్మికుల బేసిక్ నుంచి భారీగా వ్యక్తిగత స్ప్రా కోత విధించడంతో తమకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు వాపోతున్నారు.

ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా అండర్‌గ్రౌండ్‌లో విధులు నిర్వహించడం ఇబ్బందిగా మారడంతో సర్ఫేస్‌ విభాగంలో విధులు నిర్వహించేందుకు అవకాశం కోరిన కార్మికులకు, యాజమాన్యం నిర్ణయాల కారణంగా ఆర్థికంగా నష్టం కలుగుతోందని బాధితులు పేర్కొంటున్నారు. సర్ఫేస్‌లో పనిచేస్తున్నందుకు తమ వేతనాల్లో భారీగా కోతలు పడుతున్నాయని, గతంలో పొందుతున్న వేతనాలతో పోలిస్తే ప్రస్తుతం చేతికి వచ్చే జీతం గణనీయంగా తగ్గిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆరోగ్య సమస్యల కారణంగా అండర్‌గ్రౌండ్‌ విధులకు దూరంగా ఉండాల్సిన పరిస్థితుల్లో సర్ఫేస్‌ డ్యూటీకి వచ్చిన తమపై ఇలాంటి ఆర్థిక భారం మోపడం న్యాయం కాదని కార్మికులు అంటున్నారు. తమ సమస్యను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి, బేసిక్, వేజ్‌ ప్రొటెక్షన్‌ కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఈ అంశంపై కార్మిక సంఘాలు స్పందించి యాజమాన్యంతో చర్చించి బాధిత కార్మికులకు న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. సర్ఫేస్‌ జనరల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కార్మికుల వేతనాలు, బేసిక్‌ నుంచి జరుగుతున్న కోతలు, వేజ్‌ ప్రొటెక్షన్‌ అంశంపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

కార్మికుల సమస్యను పరిష్కరించకపోతే భవిష్యత్‌లో సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనకు దిగాల్సి వస్తుందని కార్మికులు హెచ్చరిస్తున్నారు.

Blogger ఆధారితం.