-->

భద్రాచలం లాడ్జిలో పాల్వంచకు చెందిన వ్యక్తి ఆత్మహత్య

మరణ వాంగ్మూలం రాసి బలవన్మరణం.. ఘటనపై పోలీసుల దర్యాప్తు


భద్రాచలం లాడ్జిలో పాల్వంచకు చెందిన వ్యక్తి ఆత్మహత్య

భద్రాచలం, అక్టోబర్ 17: భద్రాచలం పట్టణంలోని బస్టాండ్ ఎదురుగా ఉన్న ఓ ప్రైవేట్ లాడ్జిలో పాల్వంచకు చెందిన వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది.

వివరాల ప్రకారం.. పాల్వంచ పట్టణంలో ఓ గ్యాస్ కంపెనీ మేనేజర్‌గా పనిచేస్తున్న లక్ష్మీనారాయణ అనే వ్యక్తి భద్రాచలంలోని ప్రైవేట్ లాడ్జిలో ఉరివేసుకుని మృతి చెందినట్లు సమాచారం. తన మరణానికి కొందరు వ్యక్తులు కారణమంటూ మరణ వాంగ్మూలం రాసిన అనంతరం ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుడు రాసినట్లు చెబుతున్న మరణ వాంగ్మూలం ఆధారంగా, ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

Blogger ఆధారితం.