పాలకుర్తిలో విషాదం.. విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి
పాలకుర్తిలో విషాదం.. విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి
పాలకుర్తి: విద్యుత్ షాక్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన విషాద ఘటన జనగామ జిల్లా దేవరుప్పుల మండలం సీతారాంపురం గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
దేవరుప్పుల ఎస్ఐ చింత రాజు తెలిపిన వివరాల ప్రకారం.. సీతారాంపురం గ్రామానికి చెందిన మానుపాటి కిష్టయ్య (47) పెండెం భాస్కర్ ఇంటి వద్ద మేస్త్రి పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు 11 కేవీ విద్యుత్ వైర్కు కండెపట్టీ తగలడంతో ఆయన విద్యుత్ షాక్కు గురయ్యాడు. దీంతో కిష్టయ్య అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు.
మృతుడి కుమారుడు మానుపాటి నితిన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనకు సంబంధించి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్ఐ చింత రాజు వెల్లడించారు.

Post a Comment