-->

తూప్రాన్ ఫ్యాక్స్ చైర్మన్‌గా ఉమన్నగారి భాస్కర్ రెడ్డి ప్రమాణ స్వీకారం

గజ్వేల్‌లో కాంగ్రెస్ జెండా ఎగరాలి.. కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి: మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి


తూప్రాన్ ఫ్యాక్స్ చైర్మన్‌గా ఉమన్నగారి భాస్కర్ రెడ్డి ప్రమాణ స్వీకారం

గజ్వేల్‌లో కాంగ్రెస్ జెండా ఎగరాలి.. కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి: మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి

తూప్రాన్, అక్టోబర్ 16: గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసి, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని మెదక్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. పార్టీలో ఎన్ని వర్గాలు ఉన్నా ఎన్నికల సమయంలో అందరూ ఐక్యంగా ఒకే తాటిపై నిలబడి పార్టీ విజయానికి కృషి చేయాలని ఆయన సూచించారు.

శుక్రవారం తూప్రాన్‌లో నూతనంగా ఫ్యాక్స్ చైర్మన్‌గా ఎన్నికైన ఉమన్నగారి భాస్కర్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించడంతో పాటు గజ్వేల్ నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉంది

కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలుతో పాటు మహిళలు, రైతులు, విద్యార్థులు, పేద ప్రజల సంక్షేమానికి అనేక కార్యక్రమాలను చేపడుతోందని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మార్గదర్శకత్వంలో ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తున్నామని పేర్కొన్నారు.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, సన్నబియ్యం పంపిణీ, విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ పథకం, ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ స్కూళ్ల ఏర్పాటు, ఉచిత విద్యుత్ వంటి కార్యక్రమాలను ప్రస్తావిస్తూ ప్రజల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు.

ఈ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మంత్రి విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ఆస్తులు, ఫామ్‌హౌస్‌ల వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ, ప్రజల సొమ్ము వినియోగం, ప్రభుత్వ వనరుల నిర్వహణపై ప్రశ్నలు లేవనెత్తారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని హామీ ఇచ్చి అమలులో విఫలమయ్యారని విమర్శించారు. మల్లన్నసాగర్ నీటిని ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌కు తరలిస్తున్నారంటూ ఆరోపణలు చేశారు.

గజ్వేల్‌లో కాంగ్రెస్‌కు బలమైన క్యాడర్ ఉంది

మెదక్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ కోసం, పార్టీ జెండా కోసం గజ్వేల్ నియోజకవర్గ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు గుర్తింపు కల్పించడం కాంగ్రెస్ నాయకత్వంతోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

పదవులు వస్తుంటాయి, పోతుంటాయని, కానీ కాంగ్రెస్ కార్యకర్తకు పార్టీతో అనుబంధం ఎప్పటికీ ఉంటుందని అన్నారు. గజ్వేల్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన సమయంలో యువత చేసిన త్యాగాలను ప్రస్తావిస్తూ బీఆర్ఎస్ నాయకత్వంపై విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ కులమతాలకు అతీతంగా ప్రజలను కలుపుకొని ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు కృషి చేస్తోందని వివరించారు. బీజేపీ, బీఆర్ఎస్ ప్రచారాన్ని కార్యకర్తలు సమర్థవంతంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. మైనంపల్లి హనుమంతరావు విలువలతో కూడిన రాజకీయ మార్గదర్శకత్వంలో పనిచేస్తున్నామని తెలిపారు.

పార్టీ కోసం ఐక్యంగా పనిచేస్తాం

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు, సర్పంచుల ఫోరం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు చిట్కుల మైపాల్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్‌కు బలమైన క్యాడర్ ఉందని, ప్రజల కోసం నిబద్ధతతో పనిచేసే కార్యకర్తలు పార్టీకి బలమని అన్నారు.

పార్టీ ప్రకటిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని సూచించారు. పార్టీ నిర్ణయాలకు అనుగుణంగా ముందుకు సాగుతూ కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తామని తెలిపారు.

రైతుల సంక్షేమమే నా ప్రధాన లక్ష్యం: భాస్కర్ రెడ్డి

నూతనంగా తూప్రాన్ ఫ్యాక్స్ చైర్మన్‌గా ఎన్నికైన ఉమన్నగారి భాస్కర్ రెడ్డి ప్రమాణ స్వీకారం అనంతరం మాట్లాడుతూ, తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని హామీ ఇచ్చారు.

ఈ పదవిని రైతుల సంక్షేమానికి అంకితం చేస్తానని, రైతులకు మేలు జరిగేలా అవసరమైన చర్యలు తీసుకుంటానని తెలిపారు. కార్యకర్తగా, నాయకుడిగా ప్రజలకు సేవ చేస్తూ వచ్చిన తనకు చైర్మన్ పదవి లభించడం మరింత బాధ్యతను పెంచిందన్నారు.

తనపై అధిష్ఠానం, ప్రభుత్వం, పార్టీ నాయకులు ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తానని స్పష్టం చేశారు. గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు బలమైన క్యాడర్ నిర్మాణానికి కృషి చేస్తానన్నారు. పార్టీలో ఎన్ని వర్గాలు ఉన్నా అందరినీ కలుపుకొని ముందుకు సాగుతానని, అన్ని వర్గాల నాయకులు, కార్యకర్తలకు సముచిత స్థానం కల్పిస్తానని హామీ ఇచ్చారు. కార్యకర్తలే తన బలమని, కాంగ్రెస్ పార్టీయే తనకు అండ అని పేర్కొన్నారు.

పలువురు నాయకులు, కార్యకర్తల హాజరు

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జూపల్లి మల్లారెడ్డి, తూప్రాన్ మున్సిపల్ అధ్యక్షుడు గరిగే నర్సింగరావు, వైస్ ప్రెసిడెంట్ కొక్కొండ చంద్రశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి లయన్ డాక్టర్ అఫ్సర్ బాయ్, తాడూరి కృష్ణారెడ్డి, గుండ్రెడ్డిపల్లి సర్పంచ్ దోమలపల్లి యాదమ్మ, కృష్ణ ముదిరాజ్, బంగరిగాళ్ల రామస్వామి, జావిద్ పాషా, కొడిపాక వెంకటేశం గుప్త, బజారు విశ్వరాజు, ఆకుల శ్రీరాములు తదితర నాయకులు పాల్గొన్నారు.

ఫ్యాక్స్ వైస్ చైర్మన్ ఎరుకల నర్సింహ, డైరెక్టర్లు బియ్యాని తిరుపతి రెడ్డి, మన్నె తిరుపతి, నక్కలపల్లి బాలమణి, లెల్లపాటి రామచంద్ర రెడ్డి, ఎంగలి అనిల్ కుమార్, మన్నె ధర్మేందర్, రావెల్లి కృష్ణ, దండు సత్యనారాయణ, కాంగ్రెస్ నాయకుడు శ్రీనివాస్ రెడ్డి తదితరులు హాజరై నూతన చైర్మన్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

Blogger ఆధారితం.