-->

రైతులు ఇబ్బందులు పడుతుంటే.. సీఎం, మంత్రులు గోవా, ఢిల్లీ పర్యటనల్లో బిజీ!

 

రైతులు ఇబ్బందులు పడుతుంటే.. సీఎం, మంత్రులు గోవా, ఢిల్లీ పర్యటనల్లో బిజీ!

రైతులు ఇబ్బందులు పడుతుంటే.. సీఎం, మంత్రులు గోవా, ఢిల్లీ పర్యటనల్లో బిజీ!

ఎల్‌నినోపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహణలో గందరగోళం.. ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శలు

రాష్ట్రంలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు గోవా, ఢిల్లీ పర్యటనలు చేస్తూ బిజీగా ఉన్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో రైతులకు సంబంధించిన అంశాలపై నిర్వహించాల్సిన వీడియో కాన్ఫరెన్స్ విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఎల్‌నినో పరిస్థితులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడతారని అధికారులు ఎమ్మెల్యేలకు, రైతులకు సమాచారం ఇచ్చారని హరీశ్ రావు పేర్కొన్నారు. రైతులు రైతు వేదికల వద్దకు రావాలని కూడా సర్క్యులర్ జారీ చేశారని తెలిపారు.

అయితే, ఉదయం 9:52 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ రద్దు చేసినట్లు సందేశం పంపించారని ఆయన అన్నారు. అనంతరం ఉదయం 11:15 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ఉంటుందని, అందరూ రావాలని మళ్లీ సమాచారం ఇచ్చారని పేర్కొన్నారు. కొద్దిసేపటికే మధ్యాహ్నం 1 గంటకు ముఖ్యమంత్రి హాజరుకారని, ఉప ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి పాల్గొంటారని చెప్పినట్లు వెల్లడించారు.

రైతులు ఇప్పటికే పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో కీలకమైన సమావేశం విషయంలో ఇలా పదేపదే నిర్ణయాలు మార్చడం సరైన పద్ధతి కాదని హరీశ్ రావు విమర్శించారు. రైతులను సమావేశం కోసం రైతు వేదికల వద్దకు పిలిచి, సమయాలను మార్చడం ద్వారా వారిని ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు.

రైతుల సమస్యలపై ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, కీలకమైన వ్యవసాయ అంశాలపై స్పష్టమైన కార్యాచరణతో ముందుకు రావాలని ఆయన డిమాండ్ చేశారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు

Blogger ఆధారితం.