-->

అంగన్వాడి కేంద్రంలో పైకప్పు పెచ్చులు ఊడి ముగ్గురు చిన్నారులకు గాయాలు (వీడియో)

 

అంగన్వాడి కేంద్రంలో పైకప్పు పెచ్చులు ఊడి ముగ్గురు చిన్నారులకు గాయాలు (వీడియో)

అంగన్వాడి కేంద్రంలో పైకప్పు పెచ్చులు ఊడి ముగ్గురు చిన్నారులకు గాయాలు

కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని అంకుసాపూర్–తెలిగూడ గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామంలోని అంగన్వాడి కేంద్రంలో ఒక్కసారిగా పైకప్పు పెచ్చులు ఊడి చిన్నారులపై పడటంతో ముగ్గురు చిన్నారులు గాయపడ్డారు.



ఈ ఘటనలో సాత్విక్, మూడేళ్లు, నిహారిక, నాలుగేళ్లు, సాయినాథ్, ఐదేళ్లకు గాయాలయ్యాయి. చిన్నారులను చూసేందుకు వచ్చిన వారి తల్లులు సోనీ, సంధ్యారాణి కూడా గాయపడినట్లు సమాచారం. ఘటనను గమనించిన స్థానికులు వెంటనే క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

అయితే అంగన్వాడి కేంద్రం ఇప్పటికే శిథిలావస్థలో ఉందని, భవనం పరిస్థితిపై ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని చిన్నారుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారుల ప్రాణాలకు ముప్పు కలిగే పరిస్థితులు ఉన్నప్పటికీ ముందస్తు చర్యలు తీసుకోకపోవడంపై వారు ప్రశ్నిస్తున్నారు.

ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా శిథిలావస్థలో ఉన్న అంగన్వాడి కేంద్రాలను వెంటనే పరిశీలించి, అవసరమైన మరమ్మతులు చేపట్టాలని తల్లిదండ్రులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Blogger ఆధారితం.