టేకులపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. బొలెరో, కారు ఎదురెదురు ఢీ!
టేకులపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. బొలెరో, కారు ఎదురెదురు ఢీ!
భద్రాద్రి కొత్తగూడెం: టేకులపల్లి మండలం తంగేళ్ల తండా సమీపంలో ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి వస్తున్న బొలెరో వాహనం, కొత్తగూడెం వైపు నుంచి వస్తున్న కారును ఎదురెదురుగా బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురితో పాటు బొలెరో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలను పరిశీలించారు. రహదారిపై నిలిచిపోయిన వాహనాలను పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. దీంతో వాహనాల రాకపోకలు తిరిగి సాధారణ స్థితికి చేరుకున్నాయి. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Post a Comment