అందగత్తెలు కాదు.. ఆరితేరిన ఆడ దొంగలు! అయ్యప్ప భక్తులే టార్గెట్

 

అందగత్తెలు కాదు.. ఆరితేరిన ఆడ దొంగలు! అయ్యప్ప భక్తులే టార్గెట్

అందగత్తెలు కాదు.. ఆరితేరిన ఆడ దొంగలు! అయ్యప్ప భక్తులే టార్గెట్

శబరిమల అయ్యప్ప భక్తులను లక్ష్యంగా చేసుకుని చోరీలకు యత్నించిన ఇద్దరు అంతర్రాష్ట్ర మహిళా దొంగలను కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. చోరీలకు పాల్పడేందుకు అనుమానాస్పదంగా వ్యవహరిస్తుండటంతో బస్సు సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.

రాణి పోలీస్ స్టేషన్ సమీపంలో బస్సును ఆపిన పోలీసులు ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. మహిళా పోలీసులతో తనిఖీలు చేయించగా.. ఓ మహిళ లోదుస్తుల్లో దాచిన రూ.21 వేల నగదు బయటపడింది.

నిందితులను తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన భవాని అలియాస్ పార్వతి, తూత్తుకుడికి చెందిన లక్ష్మి అలియాస్ పార్వతిగా గుర్తించారు. వీరిపై గతంలోనూ పలు ప్రాంతాల్లో చోరీ కేసులు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు.

శబరిమల యాత్రా సీజన్‌లో ఎరుమేలి సహా ప్రధాన ఆలయాల వద్ద భక్తుల రద్దీని ఆసరాగా చేసుకుని నగదు, విలువైన వస్తువులను దొంగిలించేందుకు వచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భక్తులకు పోలీసుల హెచ్చరిక: యాత్ర సమయంలో రద్దీ ప్రాంతాల్లో నగదు, మొబైల్ ఫోన్లు, విలువైన వస్తువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

Blogger ఆధారితం.