చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఏడు రైలు బోగీలు దగ్ధం!

చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఏడు రైలు బోగీలు దగ్ధం!


చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఏడు రైలు బోగీలు దగ్ధం!

హైదరాబాద్: చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్టేషన్‌ ఆవరణలో మెయింటెనెన్స్‌ పనుల కోసం నిలిపి ఉంచిన ఖాళీ రైలులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో తీవ్ర కలకలం రేగింది. ఈ ప్రమాదంలో మొత్తం ఏడు బోగీలు అగ్నికి ఆహుతైనట్లు తెలుస్తోంది.

ప్లాట్‌ఫామ్‌ నంబర్‌ 5, 6 మధ్య నిలిపి ఉంచిన రైలులోని చివరి బోగీలో సాయంత్రం సుమారు 6:30 గంటల సమయంలో మంటలు ప్రారంభమైనట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. చూస్తుండగానే మంటలు పక్కనున్న బోగీలకు వ్యాపించాయి.

దీంతో రైల్వే స్టేషన్‌ పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు అలుముకున్నాయి. మంటలను గమనించిన ప్రయాణికులు, రైల్వే సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

మెయింటెనెన్స్‌ కోసం నిలిపి ఉంచిన ఖాళీ రైలు కావడంతో ప్రయాణికులు లేకపోవడం వల్ల ప్రాణనష్టం తప్పినట్లు ప్రాథమిక సమాచారం. అయితే ప్రమాదానికి గల అసలు కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. అగ్నిప్రమాదంపై రైల్వే అధికారులు విచారణ చేపట్టాల్సి ఉంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


Blogger ఆధారితం.