పోలీస్ క్వార్టర్స్‌లో మహిళా హోంగార్డు దారుణ హత్య.. భర్తే హంతకుడా?

 

పోలీస్ క్వార్టర్స్‌లో మహిళా హోంగార్డు దారుణ హత్య.. భర్తే హంతకుడా?

పోలీస్ క్వార్టర్స్‌లో మహిళా హోంగార్డు దారుణ హత్య.. భర్తే హంతకుడా?

నల్లగొండ: పోలీస్ క్వార్టర్స్‌లో మహిళా హోంగార్డు దారుణ హత్యకు గురైన ఘటన నల్లగొండ జిల్లాలో కలకలం రేపింది. నల్లగొండ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రూరల్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న పోలీస్ క్వార్టర్స్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

హెడ్‌క్వార్టర్స్‌లో విధులు నిర్వహిస్తున్న మహిళా హోంగార్డు మెహబూబ్ బీ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఆమె భర్త సతీష్ గొంతు నులిమి హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మెహబూబ్ బీ, సతీష్ కులాంతర వివాహం చేసుకున్నట్లు సమాచారం. అయితే కొంతకాలంగా వీరిద్దరి మధ్య తరచూ కుటుంబ కలహాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే భార్యాభర్తల మధ్య వివాదం హత్యకు దారితీసిందా అనే కోణంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఘటనపై సమాచారం అందుకున్న వన్‌టౌన్ పోలీసులు వెంటనే పోలీస్ క్వార్టర్స్‌కు చేరుకుని పరిశీలించారు. ఘటనకు సంబంధించిన వివరాలను సేకరిస్తూ దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు దారితీసిన పరిస్థితులు, నిందితుడిగా అనుమానిస్తున్న భర్త పాత్రపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

మహిళా హోంగార్డు హత్య ఘటనతో పోలీస్ వర్గాల్లోనూ స్థానికంగానూ ఆందోళన నెలకొంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, హత్యకు గల అసలు కారణాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.

Blogger ఆధారితం.