రేవంత్ రెడ్డికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వార్నింగ్.. ‘ఖబర్దార్ బిడ్డా.. యుద్ధం స్టార్ట్ అవుతుంది!

 

రేవంత్ రెడ్డికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వార్నింగ్.. ‘ఖబర్దార్ బిడ్డా.. యుద్ధం స్టార్ట్ అవుతుంది!

రేవంత్ రెడ్డికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వార్నింగ్.. ‘ఖబర్దార్ బిడ్డా.. యుద్ధం స్టార్ట్ అవుతుంది!’

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనకు అధికారం ఉందని ఇష్టానుసారంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. ‘‘రేవంత్ రెడ్డి.. నీకు అధికారం ఉంది కదా అని నేను ఏం చేసినా నడుస్తది అనుకుంటే ఖబర్దార్ బిడ్డా.. యుద్ధం స్టార్ట్ అవుతది’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

మూడేళ్ల పాలన తర్వాత కూడా తెలంగాణ ప్రజలు సంతోషంగా లేరని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ అంటే కేవలం కొడంగల్, మధిర మాత్రమే కాదని, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమానంగా నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఒళ్లు దగ్గర పెట్టుకొని పనిచేయాలని సూచించారు.

తనను పండబెట్టి తొక్కుతానని రేవంత్ రెడ్డి అంటున్నారని పేర్కొన్న రాజగోపాల్ రెడ్డి.. ‘‘నువ్వు తొక్కితే తొక్కించుకునేలా కనిపిస్తున్నానా రేవంత్ రెడ్డి? నీ అదృష్టం బాగుండి ముఖ్యమంత్రి అయ్యావు. ఇంకో రెండేళ్లు ఉంటావు’’ అంటూ వ్యాఖ్యానించారు.

ప్రజల సొమ్మును కాపాడటమే తన లక్ష్యమని స్పష్టం చేసిన ఆయన.. కాంట్రాక్టు టెండర్ ఎంతకు పిలిచారో చెబితే, దానికంటే 20 శాతం తక్కువకే టెండర్ వేస్తానని సవాల్ విసిరారు. తాను ప్రజల సొమ్ము తినే వ్యక్తిని కాదని పేర్కొన్నారు.

మునుగోడుతో పాటు ఇతర నియోజకవర్గాలకు కూడా నిధులు కేటాయించాలని అడిగినందుకే తనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. అధికార కాంగ్రెస్ పార్టీలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతుండటంతో రాష్ట్ర రాజకీయాల్లో ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.


Blogger ఆధారితం.