ఆర్మూర్ బాలాజీ లాడ్జ్‌లో వ్యభిచారం గుట్టురట్టు.. నలుగురు పట్టివేత!
ఆర్మూర్ బాలాజీ లాడ్జ్‌లో వ్యభిచారం గుట్టురట్టు.. నలుగురు పట్టివేత!
ఆర్మూర్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని బాలాజీ లాడ్జ్‌లో జరుగుతున్న వ్యభిచార కార్యకలాపాలను పోలీసులు బట్టబయలు చేశారు. నమ్మకమైన సమాచారం మేరకు శనివారం రాత్రి లాడ్జ్‌పై దాడి చేసిన పోలీసులు రెండు వేర్వేరు గదుల్లో అసభ్యకర స్థితిలో ఉన్న నలుగురిని పట్టుకున్నారు.
ఆర్మూర్ పట్టణ ఎస్‌ఐ రజనీకాంత్ తన సిబ్బందితో కలిసి ఈ దాడి నిర్వహించారు. ఎస్‌హెచ్‌ఓ కొండి చంద్రశేఖర్ రెడ్డి సూచనల మేరకు లాడ్జ్‌లో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో రెండు గదుల్లో ఒక్కో మహిళ, ఒక్కో పురుషుడు చొప్పున పట్టుబడ్డారు.
పోలీసుల విచారణలో లాడ్జ్ నిర్వాహకుడిని ఆర్మూర్‌లోని అశోక్‌నగర్‌కు చెందిన దేవరాజుగా గుర్తించారు. కేవలం 15 రోజుల క్రితమే లాడ్జ్‌ను అద్దెకు తీసుకున్న అతను, ఒక్కొక్కరి నుంచి రూ.400 వసూలు చేస్తూ గదులను అద్దెకు ఇస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు ఎస్‌హెచ్‌ఓ తెలిపారు.
ఈ కేసులో లాడ్జ్ నిర్వాహకుడు దేవరాజుతో పాటు వ్యభిచారం కోసం వచ్చిన ఒక పురుషుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని గౌరవ న్యాయస్థానం ఎదుట హాజరుపరచనున్నట్లు ఆర్మూర్ ఎస్‌హెచ్‌ఓ కొండి చంద్రశేఖర్ రెడ్డి ఆదివారం పోలీస్ స్టేషన్‌లో వెల్లడించారు.
పోలీసుల దాడితో బాలాజీ లాడ్జ్‌లో సాగుతున్న అనైతిక కార్యకలాపాలు వెలుగులోకి రావడం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.

Post a Comment