సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళా టీచర్లు మృతి!

సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళా టీచర్లు మృతి!


సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళా టీచర్లు మృతి!

సూర్యాపేట పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన టిప్పర్ లారీ స్కూటీని ఢీకొట్టడంతో ఇద్దరు మహిళా ఉపాధ్యాయులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

మృతులను చివ్వెంల పాఠశాల ప్రిన్సిపల్ కోట్ల రజిత, అధ్యాపకురాలు గుగులోతు రుక్మాగా గుర్తించారు. పాఠశాలలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో వీరిద్దరూ స్కూటీపై బయటకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

బీబీగూడెం నుంచి వ్యవసాయ మార్కెట్ వైపు వెళ్తున్న సమయంలో వేగంగా వచ్చిన టిప్పర్ లారీ వారి స్కూటీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఒకే పాఠశాలలో పనిచేస్తున్న ఇద్దరు ఉపాధ్యాయులు ఒకేసారి మృత్యువాత పడటంతో విద్యా రంగంలో, స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.


Blogger ఆధారితం.