హైదరాబాద్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల భారీ దాడులు.. కరాచీ బేకరీ లైసెన్సులు సస్పెండ్!

హైదరాబాద్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల భారీ దాడులు.. కరాచీ బేకరీ లైసెన్సులు సస్పెండ్!  హైదరాబాద్ నగరంలో ఆహార భద్రతా ప్రమాణాలు పాటించని సంస్థలపై తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు చర్యలు చేపట్టారు. 11 ప్రత్యేక బృందాలతో నిర్వహించిన తనిఖీల్లో కరాచీ బేకరీకి చెందిన గగన్‌పహాడ్, శ్రీనగర్ కాలనీ తయారీ యూనిట్లలో తీవ్ర అపరిశుభ్రతను గుర్తించారు.  గగన్‌పహాడ్ యూనిట్‌లో ఎలుకల వ్యర్థాలు, బూజు పట్టిన గోడలు, తుప్పు పట్టిన బేకింగ్ ట్రేలు బయటపడ్డాయి. ఆహార పదార్థాల సమీపంలోనే శుభ్రపరిచే రసాయనాలను నిల్వ చేసినట్లు అధికారులు గుర్తించారు. దీంతో 1,012 కిలోల ప్యాక్డ్ ఆహార పదార్థాలను సీజ్ చేశారు.  ఈ తనిఖీల్లో భాగంగా కరాచీ బేకరీ యూనిట్లతో పాటు మరో నాలుగు మాంసం విక్రయ సంస్థల FSSAI లైసెన్సులను సస్పెండ్ చేశారు. ముషీరాబాద్‌లోని వతన్ ట్రేడర్స్, సికింద్రాబాద్‌లోని పంజాబ్ ఫిష్ కంపెనీ, ఉప్పల్‌లోని ఎస్‌ఎం సీ కార్పొరేషన్‌లను తక్షణమే మూసివేయాలని ఆదేశించారు.  మొత్తంగా రూ.4.34 లక్షల విలువైన ఆహార ఉత్పత్తులను సీజ్ చేయగా, మరో 10 సంస్థలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఆహార భద్రతా నిబంధనలు ఉల్లంఘించే సంస్థలపై కఠిన చర్యలు కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు.


 హైదరాబాద్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల భారీ దాడులు.. కరాచీ బేకరీ లైసెన్సులు సస్పెండ్!

హైదరాబాద్ నగరంలో ఆహార భద్రతా ప్రమాణాలు పాటించని సంస్థలపై తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు చర్యలు చేపట్టారు. 11 ప్రత్యేక బృందాలతో నిర్వహించిన తనిఖీల్లో కరాచీ బేకరీకి చెందిన గగన్‌పహాడ్, శ్రీనగర్ కాలనీ తయారీ యూనిట్లలో తీవ్ర అపరిశుభ్రతను గుర్తించారు.

గగన్‌పహాడ్ యూనిట్‌లో ఎలుకల వ్యర్థాలు, బూజు పట్టిన గోడలు, తుప్పు పట్టిన బేకింగ్ ట్రేలు బయటపడ్డాయి. ఆహార పదార్థాల సమీపంలోనే శుభ్రపరిచే రసాయనాలను నిల్వ చేసినట్లు అధికారులు గుర్తించారు. దీంతో 1,012 కిలోల ప్యాక్డ్ ఆహార పదార్థాలను సీజ్ చేశారు.

ఈ తనిఖీల్లో భాగంగా కరాచీ బేకరీ యూనిట్లతో పాటు మరో నాలుగు మాంసం విక్రయ సంస్థల FSSAI లైసెన్సులను సస్పెండ్ చేశారు. ముషీరాబాద్‌లోని వతన్ ట్రేడర్స్, సికింద్రాబాద్‌లోని పంజాబ్ ఫిష్ కంపెనీ, ఉప్పల్‌లోని ఎస్‌ఎం సీ కార్పొరేషన్‌లను తక్షణమే మూసివేయాలని ఆదేశించారు.

మొత్తంగా రూ.4.34 లక్షల విలువైన ఆహార ఉత్పత్తులను సీజ్ చేయగా, మరో 10 సంస్థలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఆహార భద్రతా నిబంధనలు ఉల్లంఘించే సంస్థలపై కఠిన చర్యలు కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు. 

Blogger ఆధారితం.