-->

ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి మహిళపై లైంగిక దాడి

 

ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి మహిళపై లైంగిక దాడి

ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి మహిళపై లైంగిక దాడి

హైదరాబాద్‌లో ఘటన.. నిందితుడి కోసం పోలీసుల గాలింపు

హైదరాబాద్: ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి ఓ మహిళపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. ఇంటి పని ఇప్పిస్తానని నమ్మించి మహిళను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఈ దారుణానికి పాల్పడినట్లు ఫిర్యాదు అందింది.

వివరాల్లోకి వెళ్తే.. రాయదుర్గం ప్రాంతం నుంచి ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్న మహిళను ఓ యువకుడు అడ్డగించి పరిచయం చేసుకున్నాడు. ఇంటి పని ఇప్పిస్తానని చెప్పి ఆమెను నమ్మించాడు. మహిళ తన భర్తకు చెప్పి వస్తానని తెలిపినప్పటికీ, యువకుడు ఆమెను మాటలతో నమ్మించి ఆటోలో ఎక్కించుకున్నట్లు సమాచారం.

అనంతరం ఆమెను జూబ్లీహిల్స్ రోడ్ నంబర్‌ 51 వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ చెట్లు దట్టంగా ఉండి, జనసంచారం తక్కువగా ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడినట్లు బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం.

బాధితురాలి ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం అమీర్‌పేటలోని యూసీహెచ్‌కు తరలించినట్లు సమాచారం.

నిందితుడిని గుర్తించేందుకు పోలీసులు పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల దృశ్యాలను పరిశీలిస్తున్నారు. నిందితుడి ఆచూకీ కోసం ప్రత్యేకంగా గాలింపు చర్యలు చేపట్టారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

Blogger ఆధారితం.